తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం మండలంలో

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి

శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో.
భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని
వెంబడించాడు. మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడుట. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక రాలి క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు. ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నిచోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని
కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని
కనుగొని ఆలయాన్ని కట్టించాడు. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ। ఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది। ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.
స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారిమూర్తిని చూసి అద్భుతమని చేతులు  జోడించవససినదే. ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం -- శ్రీ ఉమా  కమండలేశ్వరాలయం. పూర్వం అక్కడ త్రిమూర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట. ఆ సమయంలో  ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట. అందుకే ఈ ఆలయం ఉమా  మండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కి
ంది. ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది. ఇది చదివిన తర్వాత
వెళ్ళినవాళ్ళు గమనించండి. ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి
మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ  హరించుకుపోతుందంటారు. ట్రాన్సఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఒకసారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే త్వరలో ట్రాన్సఫర్ అవుతుందిట. తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం (పూతరేకులకు ప్రసిధ్ధి) మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి  బస్సులున్నాయి. 
రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు।

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం (kadapa)



కడప టౌన్ నుంచి ఒంటిమిట్ట 25km ఉంటుంది . శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రసిద్ధిచెందాడు.
ఈ ఆలయం ఒక రాయతో తాయారు చేయబడ్డాయి..రామ్, సీతా లక్ష్మణులు, విగ్రహాలు ఉన్నాయి.
ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉండదు. ఎందుకు అంటే.. గుడి కట్టినపుడు రాముడు ఆంజనేయ స్వామి ని కలవ లేదు . అందుకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు .

శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్థం మరియులక్ష్మనతిర్థం
వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ నుండి కొన్ని సంఘటనలకు రామాయణం మరియు మహాభారతం ఈ ఆలయం లోపల కళారూపంలో శృంగారమైన చేశారు.

జానపద నమ్మకం ప్రకారం, గ్రామం రెండు వ్యక్తులు, కంపన రాజు సహాయం చేసిన వొంతోడు మరియు మిత్తోడు, నుండి దాని పేరు పొందింది. బదులుగా, రాజు వాటిని తర్వాత గ్రామం పేరు. సమయం కాలంలో, గ్రామం ఒంటిమిట్ట అనేవారు.

సంగమేశ్వరుడి ఆలయం,సంగం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా


త్రేతాయుగంలో పరుశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా పెన్నా, బీరాపేరు, బొగ్గేరు నదులు కలిసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణిసంగమేశ్వరంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే.. కాలక్రమేణ 'సంగం' గా మారింది. 1183లో చోళరాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆతర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షిదేవి విగ్రహం ప్రతిష్ఠించారు. తదనంతరం పల్లవులు, చోళులు ఈ ఆలయానికి ముఖమండపం నిర్మించారు.
విజయనగరరాజులు ఆలయ అభివృద్ధి కోసం 100 ఎకరాల తాళ్లవనం దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఉదయగిరి, దు వ్వూరు రెడ్డిరాజులు ఆల యం వద్ద పలు కట్టడాలు నిర్మించారు. 1940లో కోట సుబ్బరామయ్యశెట్టి అనే దాత ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేపట్టారు. గోపురానికి మొదటి అంతస్తు పూర్తికాగానే ఆయన మరణించారు. దీంతో రాజగోపురం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆతర్వాత శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, నవగ్రహ మండపం, పరివార దేవతలు, పోతురాజు, పోలేరమ్మ, కామాక్షిదేవి ఆలయాలు నిర్మించారు. ఏటా చైత్రమాసం(ఏప్రిల్)లో సంగమేశ్వరుడికి బ్ర హ్మోత్సవాలు, కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పా ల్గొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తుంటారు.
పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం
శివాలయం వద్ద నిర్మించిన పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి రాజులు 101 అడుగుల ఎత్తు ఉన్న ఒంటి స్తంభానికి ప్రాతివ్రతమ్మ విగ్రహం చెక్కి ప్రతిష్ఠించారు. ఆస్తంభానికి పక్కనే ప్రాతివ్రతమ్మకు ఆలయం నిర్మించారు. ఈఆలయంలో అమ్మవారిని మహిళలు విశేషంగా కొలుస్తుంటారు 




శ్రీశైలం - పురాణ గాథ

శ్రీశైలం - పురాణ గాథ



శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.
ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది. దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది.
త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి, మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు. అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు.
ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు. వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా, మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం. శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది. స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.
సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు ‘శివానంద’, ‘సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో, అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని, అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి. కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు
శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. ‘అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’ అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా. ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి. క్రీ.శ.9-10 దశాబ్దాలనుంచి 15వ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి.
శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. హైద్రాబాద్‌నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీశైలంలో భోజన వసతి సదు
పాయాలు మెండుగా వున్నాయి.

దక్షిణ కాశి' ద్రాక్షారామం

దక్షిణ కాశి' ద్రాక్షారామం




ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు.
ప్రకృతి రమణీయతకు ఆటపట్టయిన తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగునా గుడి ఉంది. అవి శతాబ్దాల కాలం నాటివి.అలాంటి పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం 'దక్షిణ కాశి'గా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా పురాతనమైన ఆలయమనడానికి దాఖలాలుగా క్రీస్తు తరువాత 1080 నుంచి 1484 వరకూ గల శాసనాలు ఉన్నాయి. శాతవాహనుని కాలం నాటి హాలుని గ్రంథాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది.ఈ ఆలయం నిర్మాణం క్రీస్తు శకం 800 సంవత్సరంలో ప్రారంభించబడినట్టు భారత పురావస్తు పరిశోధనా సంస్థ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ఆలయానికి రెండు అంతస్తుల మండపం ఉంది. చాళుక్య భీముడు ఈ ఆలయాన్నీ, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్నీ నిర్మించాడన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయంలోని శివుడు భీమేశ్వరుడుగా ప్రాచుర్యం పొందాడు. ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు. చోళులు, శాతవాహనులు,విజయనగర రాజులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.ఈ ఆలయంలో కనిపించే శాసనాలన్నీ తెలుగు, సంస్కృతం,దేవనాగరి భాషల్లో ఉన్నాయి.
ఈ ఆలయానికి 40 కిలో మీటర్ల పరిధిలో 108 శైవాలయాలు ఉన్నాయి.
ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి. పూర్వం తారకాసురడనే రాక్షసుని కంఠంలో అమృత లింగాన్ని దేవతల మొరపై విచ్ఛిన్నం చేసినప్పుడు ఆ శివలింగం ఐదు చోట్ల ముక్కలుగా పడిందట. ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి. అవే ద్రాక్షారామం, అమరారామం (అమరావతి), క్షీరారామం (పాలకొల్లు),సోమారామం (గునుపూడి భీమవరం), సామర్లకోటలోని భీమారామంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంపై వేములవాడ భీమకవి, శ్రీనాధుడు తమ రచనల్లో ప్రధానంగా ప్రస్తావన చేశారు. శ్రీనాధుడు భీమేశ్వర దండకం రాశాడు. ద్రాక్షారామ భీమేశ్వరుని సందర్శన భాగ్యం వల్ల తనకు కవిత్వం అబ్బిందని భీమకవి పేర్కొన్నాడు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ద్రాక్షారామమని పేరు వచ్చినట్టు పౌరాణిక గాధ. ఈ ఆలయంలో అమ్మవారి పేరు మాణిక్యాంబ.
అష్టాదశ శక్తి పీఠాల్లో మాణిక్యాంబ పీఠం ఒకటి. కార్తీక మాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రాంగణంలో శిల్పకళా సంపద చరిత్రకు దర్పణం పడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు, పురావస్తు పరిశోధకులు తమకు తెలియకుండానే ఇక్కడ ఎక్కువ కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. మాణిక్యాంబకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో, శ్రావణ మాసాల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మాణిక్యాంబ అమ్మవారిని అర్చిస్తే పెళ్ళికాని ఆడపిల్లలకు వెంటనే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ద్రాక్షారామం రాజమండ్రికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. కాగా, ద్రాక్షారామానికి అతి సమీపంలో కోటిపల్లి క్షేత్రం ఉంది. నాసికా త్రయింబకంలో పుట్టిన గోదావరి కోటి పల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. కోటిపల్లి తీర్థం ఘనంగాజరుపుతూ ఉంటారు. దక్షుని శాపానికి గురైన చంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి తన ప్రకాశశక్తిని పొందినట్టు, ఇంద్రుడు ఇక్కడ స్నానం చేసి గౌతమ మహర్షి శాపం నుంచి విముక్తి పొందినట్టు పౌరాణిక గాధలు ప్రచారంలో ఉన్నాయి. కోటిపల్లి తీర్థం మీద ఎన్నో పాటలు, స్తోత్రాలు ఉన్నాయి. శైవ క్షేత్రాల్లో పేరెన్నిక గన్నది కోటిపల్లి. కాకినాడ-కోటిపల్లి రైల్వే లైను గురించి ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్‌ సమయంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. ఏళ్ళు గడిచినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి కృషి ఫలితంగా యానం నుంచి వెదుర్లంక వంతెన నిర్మాణం జరిగింది. కోనసీమకు తూర్పు డెల్టాకు మధ్య దూరాన్ని ఈ వంతెన తగ్గించింది. గతంలో రేవు దాటి వెళ్ళేవారు. ఇప్పుడు ఆటోలు,స్వంత వాహనాల్లో సులభంగా చేరుకోగలుగుతున్నారు. ద్రాక్షారామ, కోటిపల్లిలకు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. అను నిత్యం యాత్రికులతో ఈ 
క్షేత్రాలు అలరారుతూ ఉంటాయి.

పంచారామాలు

పంచారామాలు

 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.
1.దాక్షారామము -
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2.అమరారామము -
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.
3.క్షీరారామము -
క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.
4.సోమారామము -
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5.కుమార భీమారామము -
పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా
నిర్వహిస్తారు.

 


సాయి అమృత వాణి