శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం

శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం


శ్రీ మత్వయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత 
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేద్ర రుద్ర మరుదర్కకిరీటకోటి-
సంఘట్టితాంఘ్ర్‍ఇ కమలామలకాంత
లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసారదావ దహనాతుర భీకరోరు-
జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్వాద పద్మసరసిరుహ మాగతస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసారజాల పతితస్య జగన్నివాస
సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝ పోపమస్య
ప్ర్‍ఓత్కంటిత ప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసారకూపమతి ఘోరమగాధ మూలం
సంప్రాప్య దుఃఖశతసర్ప సమాకులస్య
దీనస్యదేవ కృపయా పదమాగతస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసారభీకర కరీంద్ర కరాభిఘాత-
నిష్షిష్షమర్మవపుషః సకాలార్తినాశ
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసార సర్పఘనవక్త్ర భయోగ్రతీవ్ర
దంష్ష్రాకరాల విషదగ్ధ వినష్షమూర్తే
నాగారివాహన సుధాబ్ది నివాస శౌరే
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసారవృక్ష మఘబీజమనంత కర్మ
శాఖాశతం కరణపత్ర మనంగ పుష్పం
అరుహ్య దుఃఖ దలితం పతతో దయాలో
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసార సాగర విశాల కరాల ఘోర
నక్రగ్రహగ్రసన నిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగనిచయోర్మిని పీడితస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసార సాగర నిమజ్జనముహ్య మానం
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాద ఖేద పరిహార పరావతార 
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
సంసార ఘోరగహనే చరతో మురారే
మారోగ్ర భీకర మృగ ప్రచురార్ది తస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య 
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
బద్ద్వాగలే యమభటా బహుతర్జయంతః
కర్షంతి యత్ర భవపాశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మ చిహ్నం
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
అంధస్య మే హృత వివేకమహాధనస్య
చోరై ప్రభో బలిభిరింద్రియ నామధేయైః
మోహాంధకూప కుహరే వినిపాతితస్య
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీశ శుకశౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్
లక్ష్మీనరసింహ చరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే యత్పఠంతి మనుజా హరిభక్తి యుక్తా-
స్తేప్రయాంతి తత్పదసరోజమఖండ రూపం

దేవి స్తోత్ర మాలిక









అష్టలక్ష్మి స్తోత్రం

అష్టలక్ష్మి స్తోత్రం - Asta Lakshmi Stothram











యం.ఎస్.సుబ్బలక్ష్మి గానామృతం


యం.ఎస్.సుబ్బలక్ష్మి - వెంకటేశ్వర సుప్రభాతం
MS Subbalakshmi - Venkateswara Suprabhatam



ఘంటసాల & బాల సుబ్రహ్మణ్యం - భగవద్ గీత


ఘంటసాల & బాల సుబ్రహ్మణ్యం - భగవద్ గీత 

Gantasala & SP Balasubrahmanyam - Bhagavad Geetha

     

భక్తి గీతాలు - సాయి బాబా హారతులు





1.దూప్ హారతి ---------------- Download
2.శ్రీ సాయి జపం -------------  Download
3.ఘన శ్యామ సుందర ------- Download
4.సాయిబాబా స్తోత్రం ---- ---- Download
5.బాబా 11 వచనములు ------ Download
6.ఓం జయ జగదీశ హరే ------ Download
7.కాకడ్ హారతి ( ఉదయం) ---- Download
8.శ్రీ సాయి అస్తోత్రం ------------ Download

Podcast Powered By Podbean

భక్తి గీతాలు - Sri Shiridi Saibaba Mahathyam


శ్రీ శిరిడి సాయిబాబా మహత్యం


1.శ్లోకం---------------------  Download
2.జై శ్రీ శిరిడి సాయిబాబా----- Download
3.మా పాపాలు-------------- Download
4.నువ్వు లేక అనాదలo----- Download
5.బాబా ... సాయి బాబా------ Download
6.హే పాండు రంగ ----------- Download
7.దైవం మానవ రూపం లో -- Download
8.సాయి హారతి ------------- Download

ధ్యానం - Meditation



1.ధ్యానం 
2.ఆనాపానసతి , ధ్యానం చేయు పద్దతి 
3.ధ్యానం వల్ల లాభాలు 

"ధ్యానం"
"ధీ" + "యానం" = "ధ్యానం"
"ధీ" = "సూక్ష్మశరీరాది సముదాయం"
అంటే, "ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్" అన్నమాట
"యానం" = "ప్రయాణం"
కనుక,
"ధ్యానం" అంటే,
"సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం" అన్నమాట;
దీనినే "ఆస్ట్రల్ ట్రావెల్" అంటాం.
  • ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.
"ఆనాపానసతి"
"ఆనాపానసతి" ... అన్నది గౌతమబుద్ధుడు సుమారు 2500 సం|| క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో... "ఆనాపానసతి" అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం" ... మరి దీనినే మనం "శ్వాస మీద ధ్యాస" అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి … సకల ఋషులు, సకల యోగులు .. అందరూ కలిసికట్టుగా ఇచ్చిన  అద్భుతమైన వరం.
'ఆనఅంటే 'ఉచ్ఛ్వాస'
'అపాన' అంటే 'నిశ్వాస'
'సతిఅంటే 'కూడుకుని వుండడం' 
"ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు వున్నాయి … అయితే వాటిల్లో ఒక్కటే సరి అయిన ధ్యాన పద్ధతి ... మరి అదే ఆనాపానసతి" అని బుద్ధుడు అన్నాడు.
సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ  "సత్యాన్ని కనుక్కోవాలి" అన్నప్పుడు చివరిగా  చేరే స్థితే ఆనాపానసతి .. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి.
ధ్యానం చేసే పద్ధతి 
సుఖాసనంలో .. హాయిగా .. కూర్చుని .. చేతులు రెండూ కలిపి .. కళ్ళు రెండూ మూసుకుని .. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే .. ఏకధారగా .. గమనిస్తూ వుండాలి. 
ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.
ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. 
ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

"ధ్యానం వల్ల లాభాలు"
  1. ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
  2. మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  3. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
  4. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
  5. మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
  6. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.
source: pssmovement