సంగమేశ్వరుడి ఆలయం,సంగం, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా


త్రేతాయుగంలో పరుశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా పెన్నా, బీరాపేరు, బొగ్గేరు నదులు కలిసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణిసంగమేశ్వరంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే.. కాలక్రమేణ 'సంగం' గా మారింది. 1183లో చోళరాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆతర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీకామాక్షిదేవి విగ్రహం ప్రతిష్ఠించారు. తదనంతరం పల్లవులు, చోళులు ఈ ఆలయానికి ముఖమండపం నిర్మించారు.
విజయనగరరాజులు ఆలయ అభివృద్ధి కోసం 100 ఎకరాల తాళ్లవనం దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఉదయగిరి, దు వ్వూరు రెడ్డిరాజులు ఆల యం వద్ద పలు కట్టడాలు నిర్మించారు. 1940లో కోట సుబ్బరామయ్యశెట్టి అనే దాత ఆలయానికి రాజగోపుర నిర్మాణం చేపట్టారు. గోపురానికి మొదటి అంతస్తు పూర్తికాగానే ఆయన మరణించారు. దీంతో రాజగోపురం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆతర్వాత శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, నవగ్రహ మండపం, పరివార దేవతలు, పోతురాజు, పోలేరమ్మ, కామాక్షిదేవి ఆలయాలు నిర్మించారు. ఏటా చైత్రమాసం(ఏప్రిల్)లో సంగమేశ్వరుడికి బ్ర హ్మోత్సవాలు, కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పా ల్గొని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తుంటారు.
పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం
శివాలయం వద్ద నిర్మించిన పాకనాటి ప్రాతివ్రతమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి రాజులు 101 అడుగుల ఎత్తు ఉన్న ఒంటి స్తంభానికి ప్రాతివ్రతమ్మ విగ్రహం చెక్కి ప్రతిష్ఠించారు. ఆస్తంభానికి పక్కనే ప్రాతివ్రతమ్మకు ఆలయం నిర్మించారు. ఈఆలయంలో అమ్మవారిని మహిళలు విశేషంగా కొలుస్తుంటారు 




0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి